సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాసిన వర్ల రామయ్య

కడప జిల్లా జైలర్ వరుణారెడ్డిని బదిలీ చేయండి

అమరావతి : కడప జిల్లా జైలర్ పి. వరుణారెడ్డిని బదిలీ చేయాలని కోరుతూ సీబీఐ డైరెక్టర్ కు వర్ల రామయ్య లేఖ రాశారు. వివేకా హత్య కేసు నిందితుల ప్రాణాల భద్రత దృష్ట్యా బదిలీ చేయాలని లేఖలో కోరారు. వరుణారెడ్డిని బదిలీ చేయని పక్షంలో నిందితులను మరో జైలుకు పంపాలని విన్నవించారు. గతంలో అనంతపురం జిల్లా జైలర్ గా వరుణారెడ్డి పని చేసిన సమయంలోనే.. జైలు గదిలో మొద్దు శీను హత్యకు గురయ్యారని తెలిపారు. వరుణారెడ్డి పని చేసిన ప్రతి చోట నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. వివేకా హత్య కేసు నిందితుల రక్షణ దృష్ట్యా బదిలీ చేయాలని వర్ల రామయ్య తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/