సిరులిచ్చే తల్లి లక్ష్మీదేవి ..

ఆధ్యాత్మికం: శ్రావణ మాసం ప్రత్యేకం

Lakshmi devi

శ్రావణ మాసం వచ్చే వరలక్ష్మి వ్రతం ఏంటో వైశిష్టమైనది. ప్రాముఖ్య మైనది.. శ్రావణ మాసం లో వచ్చే తొలి శుక్రవారం ఈ పండుగ రావటం విశేషం.. వరలక్ష్మీ వ్రతం కుల, మతాలకు అతీతంగా జరిగే పండుగ. స్త్రీలు సంతోషంగా ఆనందంగా జరుపుకునే పండుగ . ఆ రోజు.. తలంటు పోసుకుని శుచిగా ఉండాలి.. పూజ భక్తితో చేయాలి.. లక్ష్మీ దేవి పటం గానీ, ప్రతిమ కానీ అలంకారం చేయాలి.. రకరకాల పూలతో అలంకరించాలి.. మంచి సువాసన వెదజల్లే అగరబత్తీలు వెలిగించటంవలన ఆ ఇంటికి శుభం కలుగుతుంది.. సువాసనల మాదిరి ఆ గృహం కొత్త శోభను సంతరించుకుంటుంది.. నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు..

కొంతమంది బ్రాహ్మణులతో పూజ చేయించు కుంటే , కొంతమంది స్త్రీలు స్యయంగా చేసుకుంటారు.. ఎవరు ఎలా చేసినా విశేష ఫలితం ఉంటుంది.. సాయంత్రం స్త్రీలను పేరంటానికి పిలిచి వాయినాలు సమర్పించుకుంటారు.. కొందరు స్త్రీలు తెలిసిన వాళ్ళ ఇంటికే వెళ్లి వస్తుంటారు.. ఇలా చేయటం వలన బాంధవ్యాలు మెరుగు పడతాయి.. వరలక్ష్మీ వ్రతం చేసిన స్త్రీ ఏ గృహానికి వెళ్లినా సాదరంగా ఆహ్వానించాలి.. ఆలా చేస్తే ఆయా గృహాలకు మేలు.. వరలక్ష్మీ అంటేనే కోరిన వరాలిచ్చి, సిరులిచ్చే తల్లి.. అందుకే ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి.. సేవించాలి.. సిరులిచ్చే లక్ష్మీ ప్రతి గృహంలో సిరులు వెదజల్లుని గాక ప్రతి గృహం ఆనందంతో విలసిల్లును గాక.

-కనుమ ఎల్లారెడ్డి

‘ స్వస్థ ‘ (ఆరోగ్య జాగ్రత్తలకు ) క్లిక్ చేయండి. :https://www.vaartha.com/specials/health/