సకల సౌభాగ్యాలనిచ్చే వరలక్ష్మీ దేవి

వరలక్ష్మీ వత్రం సందర్భంగా

Varalakshmi Devi

శ్రావణ మంటే పండుగలకు శోభను తెచ్చే మాసం. అందుకే ఈ మాసం అమూల్యమైనదిగా భావిస్తారు. శ్రవణ మంటే వినడం. వినడం కూడా ఒక కళే.

చక్కగా వినేవారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి కుటుంబాన్ని రూపొందించేది ఇంటి ఇల్లాలు. ఈ మాసంలో వచ్చే పండుగ ఎంతో శుభకరమైది. శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అందే ప్రత్యేకమైనవి.

ఈ మాసంలో స్త్రీలు తమ సౌభాగ్యం, అందరి సంతోషం కోసం పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఈ మాసంలో మొదటి పదిహేను రోజుల్లో వచ్చేది గరుడ పంచమి.

బలం, ధైర్యం కోసం గరుడుడిని పూజిస్తారు. శ్రావణ సుధ సప్తమి సూర్యారాధనకు ముఖ్యమైనది. శ్రావణ సుధ ద్వాదశి రోజున శ్రీహరిని ప్రార్థిస్తారు. త్రయోదశి, చతుర్ధశిలలో శివ్ఞడు, పార్వతిలను పూజిస్తారు.

శ్రావణ శుక్రవారం వరలక్ష్మి ప్రతం ఆచరిస్తారు. వివాహమైన స్త్రీలు భర్తల మంచికోసం, సంతానం కోసం చేస్తారు.

వరలక్ష్మీ వ్రతకథ

సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనె మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభ్యాగములు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు. దానిని చెప్పెద వినుడు.

కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుని ఉండ పార్వతి పరమేశ్వరినికి నమసరించి దేవా!

లోకమున స్త్రీలు ఏ వ్రతం చేసిన సర్వ సౌభాగ్యములు, పుత్ర పౌత్రాదులు కలిగి సుకంగా ఉందురో అటువంటి వ్రతాన్ని నా కానతీయండి అనిన పరమేశ్వరడు ఇట్లు చెప్పసాగాడు.

ఓ మనోహరి! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగజేయం వరలోఈ్మ వ్రతంబను ఒక వ్రతము కలదు. ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణమకు ముందుగ వచ్చెడి శుక్రవారం నాడు చేయవలయుననిన పార్వతీదేవి ఇట్లన్నది.

ఓ లోకరాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతము ఎట్లు చేయవలనె? ఆ వ్రతమునకు విధియేమి? ఏ దేవతను పూజించవలయును? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరించబడింది?

దీనిని వివరంగా వివరింపవలయునని ప్రార్థించింది. పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరమున చెప్పెద వినుము.

మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణంఉ కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడ, బంగారు గోడలు గల ఇళ్లతోను కూడియుండెను.

ఆ పట్టణము నందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు.

ఆ వనితామణం భర్తను దేవ్ఞనితో సమానముగ తలచి ప్రతిదినము ఉదయమున మేల్కొని స్నానము ఆచరించి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదమ అత్తమామలకు ననేక విధములుగా యుపచారములు చేసి ఇంటి పనులను చేసుకుని మితముగా ప్రియముగాను భాషించుచుండెను.

ఇట్లు ఉండగా ఆ మహా పతిప్రవతకు వరలక్ష్మీ అనుగ్రహము కలిగింది. ఒకనాడు స్నప్నములో ప్రసన్నమై ‘ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని.

నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్లపూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారంనాడు నన్ను పూజించిన నీవ్ఞ కోరిన వరములు ఇచ్చెదనని చెప్పిన చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే!

శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే!! అని అనేక విధముల స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు గను అయ్యెదరు.

నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు కలిగినది అని వరలక్ష్మీ సంతోసంతో చారుమతికి అనేక వరములిచ్చి అంతర్థానమయింది.

చారుమతి తక్షణమే నిదుర మేల్కిని ఇంటికి నాలుగు ప్రక్కల చూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! తాను కలలో చూచిన స్వప్న వృత్తాంతమును భర్తకు అత్తమామలకు మొదలయిన వరికి చెప్పింది.

ఈ స్వప్నము మిగుల ఉత్తమమయినదని శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం అవశ్యముగ చేయవలసిందని చెప్పినారు.

చారుమతి స్వప్నము విన్న స్త్రీలు శ్రావణూసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లు ఉండగా వీరి భాగ్యోదయము వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారం వచ్చినది.

అంత చారుమతి, మొదలగు స్త్రీలందరు ఈ దినమే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినమని ఉదయమేనే మేల్కిని స్నానాదులు పూర్తి చేసి చిత్ర వస్త్రములు ధరించి చారుమతి గృహమున ఒక ప్రదేశమున గోమయంతో నలికి ముగ్గులు పెట్టి ఒక మంటపం ఏర్పాటు చేసి అందు ఆసనము వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్లు మొదలు పంచవల్లవంబుల చేత కలశం ఏర్పరచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలు అందరూ ఎంతో భక్తియుక్తులతో సాయంకాలము

‘పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!! అను శ్లోకముచే ధ్యానావాహాది షోడశోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి.

ఇట్లు ఒక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లయందు ఘల్లుఘల్లుమను ఒక శబ్దము కలిగింది.

అంత కాళ్లను చూచుకోగా గజ్జెలు మొదలు ఆభరణాలు కలిగినవి. చారుమత మొదలగు స్త్రీల అందరూ ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షం వలన ఇవి కలిగినవి అని పరమానందంతో మరి ఒక ప్రదక్షిణం చేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలందరికి సర్వభూషణలంకృతులైరి.

చారుమతి మొదలగు స్త్రీలంతా గృహములకు వెళ్లి స్వర్ణమయములైనా రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను తోడ్కొని పోవ్ఞటకు గృహములకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించిన స్థలమునకు వచ్చి నిలిచియుండెను.

ఆ తరువాత చారుమతి మొదలగు స్త్రీలంతా కూడా తమకు కల్పోక్తప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువ్ఞలతో కలిసి భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని యున్న వాహనములపై ఇళ్లకు పోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం అయింది.

ఆ చారుమతీదేవి వలన కదా మనకు ఇచ్చి మహాభాగ్యం, సంపత్తులు కలిగినవి అంటూ చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇళ్లకు పోయిరి.

తరువాత చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, ధనకనక వస్తువాహనములతో కూడుకుని సుఖముగా ఉండిరి. అందుకే ఓ పార్వతీ!

ఈ ఉత్తమమయిన వ్రతమును బ్రాహ్మాణాది నాలుగు జాతుల వారును చేయవచ్చు. అట్లు ఒనరించిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉందురు.

ఈ కథను చదువు వారికి వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/