సమంత నిర్ణయానికి సపోర్ట్ ఇచ్చిన ఫస్ట్ హీరోయిన్

నాగ చైతన్య తో విడిపోవడం ఫై అంత సమంత ను ట్రోల్ చేస్తున్నారు. తప్పంతా సమంత చేసిందని..మంచి ఫ్యామిలీ ని , జీవితాన్ని దూరం చేసుకుందని ఇలా ఎవరికీ తోచింది వారు అంటున్నారు. ఇక తనపై ట్రోల్ చేస్తున్న వారిపై సమంత సైతం గట్టిగానే వార్నింగ్ లు ఇస్తుంది. ఈ క్రమంలో దేవి ఫేమ్ వనిత విజయ్ కుమార్ సమంత కు సపోర్ట్ గా మాట్లాడింది.

అసలు సమాజమే లేదు బేబీ…నీ జీవితాన్ని నువ్వు ఆశ్వాదించు. ఈ సమాజం మనం తీసుకున్న ఫోటోలను మాత్రమే చూస్తుంది. దాని వెనక ఉండే వీడియో ను చూడదు. జీవితం ఎంతో గొప్పది. ప్రతిదీ జరగడానికి ఒక కారణం ఉంటుంది. ముందుకు వెళుతూ ఉండు అంటూ వనిత సపోర్ట్ గా పోస్ట్ చేసింది.

తాజాగా సమంత ఎమోషనల్ పోస్ట్ చేసింది. సొసైటీ పై అవేదన తో నాకు అఫైర్లు ఉన్నాయని రాస్తున్నారు…అబార్షన్ చేయించుకున్నా అంటున్నారు. నన్నే టార్గెట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సమాజం మగవాళ్ళు తప్పు చేస్తే ఒకలా చూస్తుంది..ఆడవాళ్ళు తప్పు చేస్తే ఒకలా చూస్తుంది అంటూ సామ్ పోస్ట్ చేసింది.

” విడాకులు అనేది చాలా పెద్ద విషయం. తన మనసును చాలా బాధించింది. ఇలాంటి సమయంలో కొంతమంది అండగా ఉండకుండా… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. నాకు ఎఫైర్స్ ఉన్నాయని మరియు పిల్లలను కావాలనే కనలేదని అంటున్నారు. ఇలాంటి వార్తలు తనను చాలా బాధించాయి. ఆ వార్తలన్నీ తప్పు. తనను ఒంటరిగా వదిలేయండి. ” అంటూ సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.