‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ ఉగాది ఉత్తమ రచనల పోటీల్లో విజేతలు

వివరాలు వెల్లడి

Ugadi Best Writing Competition
Ugadi Best Writing Competition

శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది  సందర్భంగా అమెరికా తెలుగు సాహిత్య వేదిక వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా  నిర్వహించిన 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలు గా ఎంపిక కాబడ్డాయని. వెల్లడించారు.  ఈ సారి పోటీకి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా. చెక్ రిపబ్లిక్, సింగపూర్, ఐర్లండ్ దేశాల నుంచి రచయితలు స్పందించారని తెలిపారు

“నా మొట్టమొదటి కథ, కవిత”  విభాగాలకి ఈ సారి కలం పట్టిన ఔత్సాహిక విదేశీ రచయితలు అధిక సంఖ్య లో ఉన్నారు. అందు వలన ముందు ప్రకటించిన ఒక నగదు బహుమతికి అదనంగా మరొక సమాన బహుమతిని అందించటం గరుగుతుందని వెల్లడించారు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా కృషికి గుర్తింపుగా తెలుగు సాహిత్యాభిమాని ముదుగంటి జితేందర్ రెడ్డి (హ్యూస్టన్) బహుమతులకి స్వఛ్ఛందంగా నగదు ప్రదానం చేయడం ఈ సారి ప్రత్యేకతగా తెలిపారు 

ప్రధాన విభాగం – 26వ  పోటీ విజేతల వివరాలు:

ఉత్తమ కథానిక విభాగం విజేతలు

 “కర్మ యోగి– శ్రీధర్ రెడ్డి బిల్లా (Cupertino, CA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

మిలియన్ డాలర్ బేరం” – శర్మ దంతుర్తి (Elizabethtown, KY)  ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

శ్రీలక్ష్మి” – శ్యామలాదేవి దశిక  (Winter Garden, FL) ప్రశంసా పత్రం

మరోమారు”- రాధిక నోరి, Tallahassee, FL) ప్రశంసా పత్రం

ఉత్తమ కవిత విభాగం విజేతలు

“ఇవాళ మాత్రం” -రమాకాంత్ రెడ్డి (Melbourne, Australia) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“తొలిపొద్దు సూర్యుళ్ళు”- సుధా శేఖర్ (Milwaukee, WI) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

  “ఇక్కడంతా క్షామమే”-రాపోలు సీతారామ రాజు (Johannesburg, South Africa) ప్రశంసా పత్రం

 “వీడ్కోలు” – శాంత రాయప్రోలు (Jacksonville, FL) (ప్రశంసా పత్రం)

=======================================================================

“మొట్టమొదటి రచనా విభాగం” -13 సారి పోటీ

“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు

“ఇంత సౌఖ్యమని నే చెప్పజాల” – రవి మంత్రిప్రగడ (Dublin, Ireland) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“హృదయ స్పందన- కల్యాణి నల్లాన్ చక్రవర్తుల (Sunnyvale, CA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 

“మత్స్య గంధి”- రామ్ నాథ్ బొద్దపాటి (Danbury CT) ప్రశంసా పత్రం

“పరిచితులు”- శ్రీనాథ్ వాడపల్లి (New Jersey, USA) ప్రశంసా పత్రం

 “నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు

“అన్ టైటిల్డ్”- శ్రీనాథ్ వాడపల్లి (New Jersey, USA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“జ్ఞాపకాల బరువు”- రవి మంత్రిప్రగడ (Dublin, Ireland) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“వర్షంలో ఓ సాయంత్రం”- లత కందికొండ (ISSAQUAH, WA) ప్రశంసా పత్రం

“ఉగాదులు ఉషస్సులు”- దామరాజు విశాలాక్షి(Canada) ప్రశంసా పత్రం

ఈమేరకు వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు) ప్రకటన విడుదల చేశారు

Vanguri Foundation of America, Inc. 3906 Sweet Hollow Court, Sugar Land, TX. 77498

E-mail: [email protected]

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/