పవన్‌తో వంగవీటి రాధా మంతనాలు!

pawan, Vangaveeti Radha
pawan, Vangaveeti Radha

విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో టిడిపి నేత వంగవీటి రాధాకృష్ణ సమావేశం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పవన్‌తో వంగవీటి రాధా అరగంట సేపు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. జగన్‌ను విభేదించిన వంగవీటి ఎన్నికల ముందు వైఎస్‌ఆర్‌సిపిని వీడి టిడిపిలో చేరారు. వంగవీటి రాధ ఎన్నికల సమయంలో చంద్రబాబు మళ్లీ సియం కావాలని మూడు రోజుల పాటు శ్రీయాగం కూడా చేశారు. టిడిపి అభ్యర్ధుల తరఫున ప్రచారం కూడా చేశారు. ఐతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి అనూహ్య విజయంతో ఆ పార్టీ అధికారంలోకి రావడం, టిడిపి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావడంతో వంగవీటి రాధా ఆశలు అడియాసలయ్యాయి. దీంతో వైఎస్‌ఆర్‌సిపిలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/