నేడు కువైట్‌ నుంచి రానున్న తొలి విమానం

వచ్చిన వారిని వచ్చినంటే క్వారంటైన్ కేంద్రాలకు తరలింపు

Kuwait Airways

హైదరాబాద్‌: కేంద్రప్రభుత్వాం కరోనా లాక్‌డైన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందేభారత్ మిషన్’ను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈమిషన్‌లో మొదటి దశలో భాగంగా 64 విమానాలను సిద్ధం చేసింది. కాగా, భారతీయులతో కూడిన తొలి విమానం ఈరోజు కువైట్ నుంచి హైదరాబాద్ రానుంది. నిజానికి తొలి విమానం అమెరికా నుంచి రావాల్సి ఉండగా అది రద్దయింది. ఇక, విదేశాల నుంచి రాష్ట్రంలో అడుగుపెట్టే వారిని నేరుగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక విదేశాల నుంచి వచ్చే వారి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరు కమిటీలను నియమించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/