వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మరో ప్రమాదం

,

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు తరుచు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఇప్పటికే పలు ఘటనలు చోటుచేసుకోగా..తాజాగా మరో ప్రమాదం జరిగింది. ముంబై సెంట్రల్‌ నుంచి గాంధీనగర్‌ వెళుతున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం ఉదయం 8.17 గంటలకు అతుల్‌ సమీపంలో పశువును ఢీకొంది. ట్రాక్‌పై పశువు ఢీకొనడంతో ఎక్స్‌ప్రెస్‌ ముందు భాగంలో డ్రైవర్‌ కోచ్‌ స్వల్పంగా దెబ్బ తిన్నది. దీంతో ట్రైన్ 15 నిమిషాల పాటు నిలిచిపోయింది.

ఫ్రంట్‌ కోచ్‌ స్వల్పంగా దెబ్బతినడం మినహా రైలుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. కాగా గడిచిన కొద్దీ రోజుల్లోనే వందే భారత్‌ ట్రైన్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. న్యూఢిల్లీ-వారణాసి రూట్‌లో ఇటీవల వందే భారత్‌ ట్రైన్‌ ట్రాక్షన్‌ మోటార్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవగా అంతకుముందు ముంబై-గాంధీనగర్‌ రూట్‌లో ట్రైన్‌ను పశువులు ఢీకొన్న ఘటనలు వరసగా రెండు రోజుల పాటు జరిగాయి.