రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య పై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ..

పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేందర్ రావు కారణంగానే రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మ హత్య చేసుకున్నట్లు తేలడం తో రాఘవేందర్ రావు ను కఠినంగా శిక్షించాలని అంత కోరుతున్నారు. ఈ క్రమంలో రాఘవేందర్ రావు తండ్రి వనమా వెంకటేశ్వర్ రావు బహిరంగ లేఖ ను విడుదల చేసారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తనును బాధకు గురిచేసిందని అన్నారు. చట్టం, న్యాయంపై నమ్మకం ఉందన్నారు. తన కొడుకు రాఘవేంద్ర దర్యాఫ్తుకు సహకరించేలా చేస్తానని అన్నారు. కేసులో నిజానిజాలు తేలే దాకా తన కొడుకును పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతానని హామీ ఇచ్చారు.

గమనించాల్సిన విషయం ఏంటంటే బహిరంగ లేఖ విడుదల చేసిన ఎమ్మెల్యే వనమా, ఎక్కడా కూడా తన కుమారుడు మంచివాడని సమర్థించడంగానీ , తన కుమారుడి కారణంగా ఘటన జరగలేదన్న ఖండనగానీ లేదు. వనమా ఇష్యూపైనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్‌ రియాక్ట్‌ అయ్యారు. వనమాపై ముందే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇప్పటి దాకా వచ్చి ఉండేది కాదన్నారు.