పాల్వంచ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్​.. వనమా రాఘవ దొరకలేదంటున్న పోలీసులు

అదేంటి సాయంత్రం వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేసారని..కొత్తగూడెం నుండి హైదరాబాద్ కు వచ్చి మరి అరెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. మీడియా తో మాట్లాడదామనుకున్న రాఘవ కు ఆ అవకాశం పోలీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసారని..తన కొడుకు రాఘవ ను స్వయంగా ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు అప్పగించారనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలు అంత హమ్మయ్య అనుకున్నారు. కానీ ఇప్పుడేమో వనమా రాఘవ దొరకలేదని , రాఘవ కోసం గాలిస్తున్నట్లు కొత్తగూడెం పోలీసుల చెపుతుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వనమా రాఘవ కోసం తెలంగాణ, ఏపీలలో గాలిస్తున్నామని పాల్వంచ ఏఎస్పీ చెప్పుకొచ్చాడు. ఏడెనిమిది బృందాలు రాఘవ కోసం గాలిస్తున్నాయని అన్నారు. త్వరలోనే రాఘవను పోలీసు కస్టడీలోకి తీసుకుంటామని , ఆధారాలు లభిస్తే రాఘవపై రౌడీషీట్‌ నమోదు చేస్తామని , గతంలోని కేసుల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని ఏఎస్పీ రోహిత్ రాజ్‌ చెప్పడం షాక్ కు గురి చేస్తున్నాయి. మరి రాఘవ అరెస్ట్ చేయకుండానే చేసినట్లు వార్తలు ఎలా బయటకు వచ్చాయని అంత మాట్లాడుకుంటున్నారు. కావాలనే రాఘవ ను దాచిపెట్టి పోలీసులు ఇలా అంటున్నారని కొంతమంది అంటున్నారు. మరి నిజంగా రాఘవ ను అరెస్ట్ చేయలేదా అనేది తెలియాల్సి ఉంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాఘవే అని..రామకృష్ణ ఆత్మ హత్య కు ముందు సెల్ఫీ వీడియో తీసుకొని చెప్పడం జరిగింది. ఈ వీడియో లో రామకృష్ణ సంచలన విషయాలు బయటపెట్టారు.

‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. వనమా రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి. అతని లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. కానీ ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగారు. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు.నేను ఒక్కడినే చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు నా భార్యాపిల్లల్ని తీసుకెళ్తున్నాను. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు. నేను వీళ్లందరితో పోరాటం చేసే స్థితిలో లేను. నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తితో నా అప్పులు తీర్చాలి. నాకు సహకారం అందించిన అందరికీ న్యాయం చేయాలి.” అని అన్నారు.