వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన చంద్రబాబు

vallabhaneni vamsi
vallabhaneni vamsi

అమరావతి: టిడిపి పార్టీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సస్సెండ్‌ చేశారు. నిన్న చంద్రబాబు, లోకేష్‌ పై వంశీ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇంకా మీడియాతో వంశీ మాట్లడుతూ నేను వైఎస్‌ఆర్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని, జగన్‌ వెంటే నడుస్తానని, త్వరలోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని కూడా ప్రకటించడంతో పాటు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా సమర్థంగా పోషించలేకపోతున్నారని 45 సంవత్సరాల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు అధికారం లేకపోతే ఐదారునెలలు కూడా ఆగలేకపోతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉదయం పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వంశీ వ్యవహారం చర్చకొచ్చినట్లు తెలిసింది వంశీ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశాడని అందరు చెప్పడంతో వంశీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు వంశీని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/