వాలెంటైన్స్‌ డే…పార్కులపై షీ నిఘా

Valentine's Day
Valentine’s Day

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా షీ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఓవైపు యువతీ యువకులు కలిసి తిరిగే అవకాశం ఉండటం.. మరోవైపు కొన్ని సంఘాల నిర్వాహకులు మోహరించనున్న నేపథ్యంలో నిఘా ఉంచాలని నిర్ణయించారు. గతంలో ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కొన్ని పార్కుల్ని సంఘాలు మూసేశాయి. ఆరోజు కలిసి తిరిగిన జంటలకు పెళ్లిళ్లు చేసేందుకు ప్రయత్నించడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఇలాంటి ఘటనల దృష్ట్యా ఈరోజు పటిష్ఠ పర్యవేక్షణ చేపట్టాలని షీ బృందాలు నిర్ణయించాయి. ఇందిరాపార్క్‌, నెక్లెస్‌ రోడ్డు, పీపుల్స్‌ ప్లాజా, పబ్లిక్‌ గార్డెన్‌, బిర్లా టెంపుల్‌, మల్టీప్లెక్స్‌లు.. తదితర ప్రాంతాల్లో నిఘా ఉంచేందుకు సిద్ధమయ్యారు.