వలసకార్మికులకు మొబైల్‌ సర్వీసులు ఉచితంగా ఇవ్వండి

టెలికాం సంస్థలకు లేఖలు రాసిన ప్రియాంకగాంధీ

priyanka gandhi
priyanka gandhi

న్యూదిల్లీ: దేశంలోని వలస కార్మికులకు ఉచితంగా నెలరోజులపాటు మొబైల్‌ సర్వీసులు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టి ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ టెలికాం సంస్థలను కోరారు. దీనిపై దేశంలోని ప్రముఖ మొబైల్‌ సంస్థల అధిపతులకు ఆమె వేరువేరుగా లేఖలు రాశారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంది. దీంతో చాలా ప్రాంతాలలో వలస కార్మికులు భోజన , వసతి సౌకర్యాలు లేకుండానే కాలినడకన స్వగ్రామాలకు వెలుతున్నారు. ప్రస్తుతం వారి వద్ద రీచార్జ్‌ చేసుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఉండడంతో, ఒక నెల రోజుల పాటు వలస కార్మికులకు ఉచితంగా ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ మొబైల్‌ సర్వీసులు అందించాలని ఆమె ఆ లేఖల్లో పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/