ఆధునిక భారత్ నిర్మాణంలో అటల్‌జీ కీలక పాత్రః చంద్రబాబు

vajpayee-the-leader-who-changed-the-course-of-the-country-chandrababu

అమరావతిః నేడు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా నివాళి అర్పించా రు. అటల్‌ బిహారీ వాజపేయి దేశ గమనాన్ని మార్చిన గొప్ప నేత అని కొనియాడారు. ఆధునిక భారత్ నిర్మాణంలో అటల్‌జీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వాజపేయి పాలనా కాలంలో ఊపిరిపోసుకున్న స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, టెలికాం, సూక్ష్మసేద్యం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్, ఓపెన్ స్కై పాలసీ, పోర్థుల వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిన అంశమని పేర్కొన్నారు. దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవేనని అన్నారు.

ప్రధానిగా ఉన్న సమయంలో పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటివి భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయని గుర్తుకు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ తప్పక తలుచుకోవాల్సిన దేశభక్తుడు వాజపేయి అని చంద్రబాబు పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/