ఏపీలో 18 ఏళ్లు దాటిన వాళ్లకు ఇపుడే టీకాలు ఇవ్వలేం

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడి

Vaccination
Vaccination

Amaravati: ఏపీలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా పంపిణీ జూన్‌ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. 18 ఏళ్లు దాటిన వారంతా టీకా వేయించుకోవడానికి కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొనేందుకు కొంత సమయం పడుతుందన్నారు. టీకా పంపిణీ కోసం సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు. టీకాలు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. 18 ఏళ్లు దాటిన వారు పేర్లు ఎప్పుడు నమోదు చేసుకోవాలన్న సమయాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/