ఈ ఏడాది చివరి వరకు వాక్సిన్‌ కనుగొనాలి

కరోనా నివారణకు అదొక్కటే మార్గం: ఐరాస

antonio guterres
antonio guterres

నూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా సమస్య పరిష్కారానికి వాక్సిన్‌ కనుక్కోవడం ఒకటే మార్గమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ అన్నారు. తాజాగా యాభై ఆఫ్రీకా దేశాలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రపంచదేశాలు దీని బారిన పడి విలవిలలాడుతున్నాయని, ఇప్పటికే సుమారు ఇరవై లక్షలకు పైగా ప్రజలు దీని బారిన పడ్డారని, దీని కారణంగా దేశాల ఆర్ధిక వ్యవస్ధలు దెబ్బతింటున్నాయని అన్నారు. వాక్సిన్‌ కనుగొనడం వల్ల లక్షల మంది ప్రాణాలు కాపాడడంతో పాటు, లక్షల కోట్ల నిధులను ఆదా చేయవచ్చని తెలిపారు. కరోనాకు మందు త్వరగా కనుగొనాలని, అది అందరికి ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. 2020 చివరికల్లా వాక్సిన్‌ ను తయారుచేయాలని తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/