రష్యా అధ్యక్షుడికి స్పుత్నిక్‌ టీకా

నేటి నుంచి 60ఏళ్లు ఉన్నవారికి వాక్సిన్

Russian President Putin
Russian President Putin

Moscow: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తమ దేశంలో ఉత్పత్తిచేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ మాట్లాడుతూ తమ దేశాధ్యక్షుడు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకుని దేశప్రజలకు భరోసా కల్పిస్తారని పేర్కొన్నారు.

ఇందుకు అవసరమైన ప్రభుత్వ కసరత్తులు అనీన పూర్తిచేస్తారని అనంతరం ఆయన బహిరంగంగానే వ్యాక్సిన్‌ తీసుకుంటారని రోషియావన్‌ టివి ఛానల్‌ ప్రసారం చేసింది. ఈ నెలలోనే స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ స్వఛ్చంద ప్రయోగాలను రష్యా ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి 60ఏళ్లుఉన్నవారికివఆయక్సిన్‌ ఇస్తారు.

మాస్కో మేయర్‌ సెర్గి సోబ్యానిన్‌ మాట్లాడుతూ వయోవృద్ధులకు సైతం తమ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలిస్తుందని తెలిపారు. 68 ఏళ్ల పుతిన్‌ ఇప్పటికే తమ వ్యాక్సిన్‌ మరింత పటిష్టమైనదని, అన్ని వయసులవారు వినియోగించవచ్చని భరోఆ ఇచ్చారు.

కరోనా కాలం నుంచి అధ్యక్షుడు పుతిన్‌ విడియోలింక్‌ ద్వారానే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రయాణాలు కూడా కుదించుకున్నారు. గడచిన ఆగస్టులోనే తన కుమార్తెల్లో ఒకరు క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నారని పుతిన్‌ గుర్తుచేసారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/