13 నుంచి దేశంలో వ్యాక్సినేషన్

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

Covid Vaccine
Covid Vaccine

New Delhi: జనవరి 13 నుంచి భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టే అవకాశాలు  ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర అనుమతులు ఇచ్చిన 10 రోజుల్లోగా పంపిణీ ప్రారంభించాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్  ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ,  ఇటీవల నిర్వహించిన ‘డ్రై రన్’ ప్రక్రియ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రభుత్వ సిద్ధంగా ఉందని తెలిపారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/