కొవిడ్‌ వ్యాక్సిన్‌..కేంద్రం తాజా మార్గదర్శకాలు

కరోనా సోకిన 3 నెలల తర్వాత టీకా తీసుకోవచ్చు..

న్యూఢిల్లీ: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి బారిన పడ్డ వారికి 3 నెలల తర్వాతే వ్యాక్సిన్‌ వేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాశ్‌ షీల్‌ లేఖలు రాశారు. ప్రస్తుతం దేశంలో 15, -18 ఏళ్ల వయసు టీనేజర్లకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్‌ (బూస్టర్) డోసు అందిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారు సైతం ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో కేంద్రం ఈ తాజా మార్గదర్శకాలు జారీ చేయడం గమనార్హం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/