మహేంద్రహిల్స్‌లో పాఠశాలలకు సెలవు

కరోనా వైరస్‌ ప్రభావంతో సెలవు ప్రకటించిన యాజమాన్యాలు

coronavirus
Vacation to schools in Mahendra Hills

హైదరాబాద్‌: కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రభావం సింకింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని మహేంద్రహిల్స్‌పై పడింది. ప్రస్తుతం అక్కడి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉందేది ఇదే ప్రాంతం కావడంతో కంటోన్మెంటు అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలల యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. కాగా గత నెల 19న దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన యువకుడు అక్కడి నుంచి 22న నగరంలోని మహేంద్ర హిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అయితే అతడిలో కరోనా లక్షణాలు కనబడడంతో గాంధీలో చేరాడు. అయితే అతడు వచ్చిన ఐదు రోజుల తర్వాత ఆస్పత్రిలో చేరాడు. ఈ ఐదు రోజులు ఎక్కడికెళ్లాడు? ఎవరెవరిని కలిశాడు అనే తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో మొదటి కరోనా కేసును గుర్తించింది ఇతడిలోనే. అందుకే అధికారులు అప్రమత్తమయ్యారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/