ఈసి దారుణంగా వ్యవహరిస్తుంది

v hanumanta rao
v hanumanta rao


కాకినాడ: ఎన్నికల కమీషన్‌ ఓవరాక్షన్‌ చేస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. గురువారం తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికల కమీషన్‌ ఏనాడూ దారుణంగా ప్రవర్తించలేదని ఆరోపించారు. మోదిని వ్యతిరేకించే వారిపై, ఈడి, ఐటి దాడులు చేయిస్తున్నారని, ఏపి సిఎస్‌ను అకారణంగా తొలగించారని, ఈసి పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహాన్ని దారుణంగా తొలగించారని, దీన్ని నిరసిస్తూ శుక్రవారం ఏపి వ్యాప్తంగా అన్ని అంబేద్కర్‌ విగ్రహాల వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/