చార్‌ధామ్ యాత్రకు అనుమతి వాయిదా

తదుపరి నిర్ణయం జూన్ 16 తర్వాత

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్‌లోని మూడు జిల్లాల ప్ర‌జ‌లు చార్ ధామ్‌ యాత్ర చేప‌ట్ట‌వ‌చ్చ‌ని ఇచ్చిన ఆదేశాల‌ను ప్ర‌భుత్వం నిలిపివేసింది. ఆ మూడు జిల్లాల వాసుల‌కు యాత్ర‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు మంత్రి సుబోధ్ ఉనియాల్ వెల్ల‌డించారు. రేపు నైనిటాల్ హైకోర్టు ముందుకు చార్ ధామ్‌ యాత్ర‌పై న‌మోదైన కేసు విచార‌ణ‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో వాయిదావేస్తున్న‌ట్లు, జూన్ 16 త‌ర్వాత దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి తెలిపారు. చమోలీ, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాల భక్తులు చార్‌ధామ్ యాత్ర దేవాలయాలైన బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి-యమునోత్రిలను దర్శించుకునేందుకు అనుమతించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి, కేబినెట్ మినిస్టర్ సుబోధ్ ఉనియాల్ సోమవారం చెప్పారు.


కాగా, హిమాల‌యాల్లో ఉన్న‌ కేదార్‌నాథ్‌, బ‌ద్రినాథ్‌, య‌మునోత్రి, గంగోత్రి ఆల‌యాల‌ను క‌లిపి చార్ ధామ్ అని పిలుస్తారు. ఈ క్షేత్రాలు మే నెల‌లో తెర‌చుకున్నాయి. అప్పటి నుంచి రోజువారీ పూజ‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ భ‌క్తుల‌కు అనుమ‌తినివ్వ‌డం లేదు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/