ప్రధాని మోడీ తో యూపీ సీఎం యోగి భేటీ

పార్టీ నాయకత్వ మార్పుపై ఊహాగానాలు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోడీ ని ఈరోజు కలిశారు. న్యూఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ మార్పులు తథ్యమన్న ఊహాగానాల మధ్య ఆయన ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ప్రధానిని యోగి కలిశారన్న చర్చ సాగుతోంది. బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ , ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ తో బుధవారం రాత్రి యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు. సమావేశానికి సంబంధించిన నివేదికను పార్టీ అధిష్ఠానానికి అందించడం కోసమే యోగి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/