నిత్యవసరాలు పంపిణీ చేసిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

రేషన్‌ కార్డు లేని వారికి కూడా రూ.1500 అందించాలని సూచన

uttaam kumar reddy
uttaam kumar reddy

సూర్యాపేట: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు టిపిసిసి చీఫ్‌, నల్గోండ ఎంపి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. హుజుర్‌నగర్‌లో సుమారు 200 మందికి నిత్యవసరాలు అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆటోకార్మికులు, పారిశుద్ద్య కార్మికులు అంగన్వాడి కార్యకర్తలకు ఉత్తమ్‌కుమార్‌ సరుకులను అందజేశారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌ కుమార్‌ మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 12 కేజీల బియ్యంలోనే కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న 5కేజిల బియ్యం కలిపి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు కోత లేకుండా జీతం చెల్లించాలని వలస కూలీలకు, రేషన్‌ కార్డు లేని వారికి లాక్‌డౌన్‌ సాయం రూ.1500 అందించాలని అన్నారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/