రాజగోపాల్ రెడ్డి తో ఉత్తమ్ చివరి పయత్నం..

మునుగోడు ఎమ్మెల్యే , కాంగ్రెస్ సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపి లో చేరబోతున్నారనే వార్తలు గత కొద్దీ రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఫిక్స్ అయ్యింది కూడా. అయినప్పటికీ రాజగోపాల్ ను వదులుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం..ఆయనతో బుజ్జగింపులు చేస్తూ వస్తుంది. ఇక చివరి ప్రయత్నంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ ను ఆయన ఇంటికి పంపింది.

అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి జూబ్లిహిల్స్‌లోని రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీని వీడొద్దంటూ ఉత్తమ్.. కోమటరెడ్డిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రాజగోపాల్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తి లో లేడని అర్ధమవుతుంది. ఇక ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో.. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో హైదరాబాద్‌లోని తన ఇంట్లో వరుస సమావేశాలు నిర్వహించిన కోమటరెడ్డి.. పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశాలపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈరోజు మునుగోడులో నిర్వహించే సభలో రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో కీలక ఘటన చేసుకోనుంది.