ఎమ్మెల్సీ ఫలితాలు టిఆర్‌ఎస్‌కు చెంపపెట్టు

uttam kumar reddy
uttam kumar reddy


సూర్యాపేట: తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌కు పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్పారని టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు ఎమ్మెల్సీ ఎన్నికల తరహా ఫలితాలే వస్తాయని, దేశానికి కూడా కొత్త ప్రధాని రావొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్ధులు భారీ మెజార్టీతో గెలవటం ఖాయమని ఉత్తమ్‌ పేర్కోన్నారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/