ఆ బిల్లులు పేదలు భరించలేరు..ప్రభుత్వమే చెల్లించాలి

రేషన్ కార్డుదారుల కరెంట్ బిల్లు మాఫీ చేయండి.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కరెంట్ బిల్లులపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డుదారుల కరెంట్ బిల్లు ప్రభుత్వమే భరించాలని, అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమల విద్యుత్ బిల్లులు కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ వల్ల పేదలకు ఆదాయం లేకుండా పోయిందని ఉత్తమ్‌ గుర్తుచేశారు. పరిశ్రమలు కూడా నడవట్లేదన్నారు. మూడు నెలల బిల్లులు ఒకేసారి తీశారని.. దాని వల్ల తక్కువ టారిఫ్ పరిధిలోని వినియోగ దారులు ఎక్కువ టారిఫ్‌లోకి మారారని వివరించారు. దీంతో వేల రూపాయల బిల్లులు వచ్చాయన్నారు. ఆ బిల్లులు పేదలు భరించలేరని.. ప్రభుత్వమే వాటిని చెల్లించాలని విన్నవించారు. ఈ మేరకు విద్యుత్ సీఎండీ ప్రభాకర్ రావును కలిసి వినతి పత్రం అందజేస్తామని ఉత్తమ్ వెల్లడించారు.


తాజా ఫోటో గ్యాలరీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/