అట్టహాసంగా ఉస్తాద్ భవత్ సింగ్ మూవీ ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కబోతున్న ఉస్తాద్ భవత్ సింగ్ మూవీ ప్రారంభం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ మూవీ కి ముందుగా భవదీయుడు భవత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. కానీ ఇప్పుడు భవదీయుడు ప్లేస్ లో ఉస్తాద్ అని పెట్టారు. ఉస్తాద్ భవత్ సింగ్ గా ప్రకటించారు. అంతే కాదు మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఉపశీర్షికను పెట్టారు. ఈసారి వినోదానికి మించినదంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఒక చేతిలో హార్లీ డేవిడ్సన్ బైక్‌ను.. మరోచేతిలో టీ గ్లాస్ పట్టుకుని.. పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. బ్యాక్‌గ్రౌండ్‌లో విద్యుత్ వైర్లు, కరెంట్ తయారు చేసే పరిశ్రమలు కనిపిస్తున్నాయి. ఆకాశంలో మెరుపుల మధ్య టైటిల్‌ను పెట్టారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఇది పూర్తి కాగానే హరీష్ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా , మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు .