ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్

పదేళ్లుగా మెగా అభిమానులు, జనసేన శ్రేణులు ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడింది. కొణెదల పవన్ కళ్యాణ్ ను నేను అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ మాట తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఉదయం నుండి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి సంబదించిన వీడియో వైరల్ గా మారింది.

ఇదే క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీం మరో అప్డేట్ ఇచ్చి అభిమానులను మరింత ఖుషి చేసింది. కమర్షియల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక ఈ పోస్ట‌ర్‌లో సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… అంటూ రాసుకోచ్చారు. ఇందులో పవన్ ఖాకీ డ్రెస్ లో చేతిలో సుత్తె పట్టుకున్న లుక్ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది.

Congratulations to Shri. Konidela @PawanKalyan Garu for taking the oath as a Minister in the Andhra Pradesh Cabinet 💐🫶🏼

– Team #UstaadBhagatSingh pic.twitter.com/YjjExoBdgR— Ustaad Bhagat Singh (@UBSTheFilm) June 12, 2024