లిప్‌స్టిక్‌ గన్‌

using Lipstick Gun

సాధారణంగా ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా దాడికి దిగితే చాలా మంది నోరు మెదపలేకపోతారు. పెదాలు కదలపలేరు. ఆ సమయంలో వారికి ఏం చేయాలో అర్ధం కాదు. అలాంటప్పుడు లిప్‌స్టిక్కే ఎదురు దాడి చేస్తే ఎలా ఉంటుంది. తిరగబడి పోలీసులకు సమాచారం అందిస్తే అద్భుతమే కదా! అచ్చం అలాంటి లిప్‌స్టిక్కే తయారు చేశారు.

దీనికి లిప్‌స్టిక్‌ గన్‌ అని పేరు పెట్టారు. ఒక సాధారణ లిప్‌స్టిక్‌కు అదనంగా మరో సాకెట్‌ అమర్చి దీన్ని రూపొం దించారు. దీనికున్న బటన్‌ నొక్కితే దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం వస్తుంది. అత్యవసర నెంబర్‌ 112కు సమాచారం అందిస్తుంది. ఈ పరికరాన్ని బ్లూటూత్‌ సాయంతో మొబైల్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఈ పరికరం దెబ్బకు దాడికి దిగిన వారు పలాయనం చిత్తగించక తప్పదు. భలే ఉంది కదూ!

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/