మ‌రో 50 కోట్ల ఫైజ‌ర్ వ్యాక్సిన్ డోసులు: అమెరికా

వాషింగ్టన్‌: కరోనా నేపథ్యంలో ప్ర‌పంచ దేశాల‌కు మ‌రో 50 కోట్ల ఫైజ‌ర్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వ‌డానికి అమెరికా సిద్ధ‌మ‌వుతోంది. దీనికి సంబంధించి ప్రెసిడెంట్ జో బైడెన్ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. వీటితో కలిపితే అమెరికా ఇచ్చే మొత్తం క‌రోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 110 కోట్ల‌కు చేరుకుంటుంది. ఐక్య‌రాజ్య స‌మితి సాధార‌ణ స‌భ‌లో భాగంగా జ‌ర‌గ‌నున్న వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో బైడెన్ దీనికి గురించి ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

అంతేకాదు వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ వ‌ర‌కల్లా అన్ని దేశాలు 70 శాతం జ‌నాభాకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా బైడెన్ కోర‌నున్నారు. ఈ వ్యాక్సిన్లు విరాళ‌మే అని, వీటికి ఎలాంటి రుసుము వ‌సూలు చేయ‌బోమ‌ని బైడెన్ ప్ర‌భుత్వంలోని సీనియ‌ర్ అధికారి ఒక‌రు స్ప‌ష్టం చేశారు. త‌మ దేశంలో ఇచ్చిన ప్ర‌తి డోసుకు మూడు డోసులు తాము ఇప్పుడు ప్ర‌పంచానికి ఇస్తున్న‌ట్లు చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/