గల్ఫ్‌కు అమెరికా భద్రతా దళాలు

additional troops
additional troops

అమెరికాతో ఇరాన్‌కు తలెత్తిన ఉద్రిక్తత ఇప్పుడు గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితికి దారి తీస్తుంది. ఇటీవల వరుసగా మిడిల్‌ ఈస్ట్‌ రూట్లో వెళ్తున్న ఇంధన నౌకలను పేల్చేస్తున్న నేపథ్యంలో..అమెరికా ప్రత్యేక దళాలను మోహరిస్తుంది. అదనంగా సుమారు వెయ్యి మంది భద్రతాదళాలను మిడిల్‌ ఈస్ట్‌కు అమెరికా పంపిస్తుంది. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో గత వారం రెండు నౌకలకు నిప్పు అంటించారు. ఆ ఘటనకు కారణం ఇరాన్‌ అని, ఆ నౌకలను ఇరాన్‌ మైన్లతో పేలుస్తున్నదని తాజాగా అమెరికా ఓ వీడియోను విడుదల చేసింది. కాని అగ్రరాజ్యం ఆరోపణలను ఇరాన్‌ తోసిపుచ్చింది. ఇరాన్‌పై ఆంక్షలను మరింత కఠిన తరం చేస్తున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నాడు. ఆ తర్వాతే ఇరాన్‌, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/