చైనాపై ఆంక్షలు విధించేందుకు బిల్లు

‘ది కొవిడ్‌19 అకౌంటబిలిటీ యాక్ట్‌’ పేరిట బిల్లు..అమెరికా

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ విషయంలో అమెరికా చైనాపై త్రీవ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కరోనా పుట్టుక వంటి అంశాలపై అమెరికా విచారణ జరుపుతోంది. దీనిపై వివరాలివ్వని పక్షంలో చైనాపై కఠిన ఆంక్షలు విధించడానికి ఉద్దేశించిన బిల్లున తొమ్మిది మంది సెనేటర్లు సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ‘ది కొవిడ్‌19 అకౌంటబిలిటీ యాక్ట్‌’ పేరిట ఈ బిల్లును రూపొందించారు. కరోనా వైరస్‌ విజృంభణలో చైనా పాత్రపై జరుగుతున్న అమెరికాతో పాటు తమ మిత్రపక్షాలు, ఐక్యరాజ్యస సమితి అనుబంధ సంస్థల విచారణకుచైనా నుంచి పూర్తి సహకారం లభించాల్సిందేనని బిల్లులో పేర్కొన్నారు. వైరస్‌ గురించిన సమాచారాన్నంతా అందించాలని అన్నారు.

అలాగే, అమెరికాకు చైనా పూర్తి సమాచారం అందించిందా? అన్న విషయాన్ని తమ అధ్యక్షుడు ట్రంప్‌ 60 రోజుల్లోగా కాంగ్రెస్‌కు తెలియజేయాలని అందులో పేర్కొన్నారు. చైనాలోని జంతు విక్రయ దుకాణాలను మూసివేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం ఇవ్వడంతో చైనా విఫలమతే అమెరికాలో దాని ఆస్తుల్ని స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధాలు, ఆ దేశానికి వీసా ఉపసంహరణతో పాటు తమ దేశ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇవ్వడాన్ని నిలిపేయడం, అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లోనూ చైనా సంస్థల్ని నిషేధించడం వంటి ఆంక్షలు విధించనున్నారు. చైనాపై ఈ ఆంక్షలు విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు పూర్తి అధికారం ఉంటుందని అందులో పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/