అమెరికాలో కొత్తగా 1.27 లక్షల కేసులు

అమెరికాలో కొత్తగా 1.27 లక్షల కేసులు
corona virus- america

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దేశంలో శుక్ర‌వారం రోజున అత్య‌ధికంగా కేసులు న‌మోదు అయ్యాయి. 24 గంట‌ల్లోనే ల‌క్షా 27 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది. అయితే వ‌రుస‌గా మూడ‌వ రోజు అత్య‌ధిక స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ కేసుల సంఖ్య కోటికి చేరుకున్న‌ది. వైర‌స్ కేసులు, మ‌ర‌ణాల విష‌యంలో అమెరికా తొలిస్థానంలో ఉన్న‌ది. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,36000 మంది మ‌ర‌ణించారు. మిడ్‌వెస్ట్ర‌న్‌, నార్త్ డ‌కోటా, సౌత్ డ‌కోటా, ఐఓవా, విస్కిన్‌స‌న్ రాష్ట్రాలు ఇప్పుడు కొత్త హాట్‌స్పాట్లుగా మారాయి. టెక్సాస్ రాష్ట్రంలో కూడా వైర‌స్ కేసుల సంఖ్య ప‌ది ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది. కాలిఫోర్నియాలో అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు అయ్యాయి.

చాలా మంది ఓట‌ర్లు క‌రోనా వైర‌స్ చాలా కీల‌క‌మైన అంశంగా భావించారు. కానీ ఆర్థిక అంశాల‌కు కూడా ప్ర‌జ‌లు ప్రాముఖ్య‌త ఇచ్చిన‌ట్లు ఓట్ల ద్వారా తెలుస్తున్న‌ది. మ‌రోవైపు ఇవాళ వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్ క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/