భారత్‌కు అమెరికా విదేశాంగ మంత్రి, మూడు రోజుల పర్యటన

Mike Pompeo
Mike Pompeo


హైదరాబాద్‌: అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇవాళ నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఇటీవల భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఓ విదేశీ నేతతో జరుగుతున్న మొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇదే కానున్నది. భారత్‌, అమెరికాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి ఈ సమావేశం కీలకం కానున్నది. ధ్వైపాక్షిక, ప్రాంతీయ ,గ్లోబల్‌ సమస్యలను ఇదే వేదికగా చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కూడా జరగనున్నది. భారత్‌ విదేశాంగమంత్రి జయశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/