విదేశి విద్యార్థులపై అమెరికా కీలక నిర్ణయం

ఆన్ లైన్ క్లాస్ లను ఎంచుకున్న వారు దేశం వీడాల్సిందే..ఆదేశాలు జారీ చేసిన ఐసీఈ

US says foreign students whose classes move online cannot

అమెరికా: త‌మ దేశంలో చ‌దువుకుంటున్న విదేశీ విద్యార్థుల‌కు అమెరికా షాకిచ్చింది. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ మాధ్యమంగా తరగతులకు హాజరయ్యేవారు తప్పనిసరిగా దేశాన్ని వీడి వెళ్లాల్సిందేనని అమెరికా సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్నవారిని దేశంలో ఉండనిచ్చే అవకాశాలు లేవని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘నాన్ ఇమిగ్రెంట్ ఎఫ్1, ఎం1 విద్యార్థులు, స్కూళ్లకు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులు వెళ్లిపోవాలి’ అని ఐసీఈ ఆదేశించింది. నిబంధనలను పాటించని విద్యార్థులు, తమ స్వదేశాలకు తిరిగి వెళ్లకుంటే, వారిపై చట్టపరమైన ఇమిగ్రేషన్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.’పూర్తి ఆన్ లైన్ కోర్సులను నిర్వహిస్తున్న స్కూళ్లలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారిని ఎవరినీ దేశంలో ఉండనిచ్చేది లేదు. ఈ తరహా వీసాలను తీసుకున్నా, వారిని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం దేశంలోకి అనుమతించదు’ అని కూడా వెల్లడించింది. సుమారు 11 ల‌క్ష‌ల మంది విదేశీ విద్యార్థుల‌కు అమెరికాలో యాక్టివ్‌ స్టూడెంట్ వీసాలు ఉన్నాయి.  


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/