నేడు ఎదురుపడనున్న ట్రంప్, బిడెన్

biden – trump

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్షు ఎన్నికల సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌, డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు రాత్రి 9 గంటలకు మొదటి అధ్యక్ష చర్చకు ట్రంప్‌, జో బిడెన్ హాజరుకానున్నారు. మొత్తం మూడు చర్చలు జరుగనున్నాయి. మొదటి అధ్యక్ష చర్చ క్లీవ్‌ల్యాండ్‌ (ఒహియో) లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం ఆవరణలో 90 నిమిషాలపాటు జరుగనున్నది. దీనిలో 6 సమస్యలపై చర్చ జరుగుతుంది. 24 రోజుల వ్యవధిలో మిగతా రెండు చర్చలు కూడా జరుగుతాయి. రెండవది (మయామిలోని అడ్రియన్ ఎర్స్ట్ సెంటర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) 15న, మూడవది (నాష్విల్లెలోని బెల్మాంట్ విశ్వవిద్యాలయం) అక్టోబర్ 22 న ఉంటుంది. కరోనావైరస్ కారణంగా ఈసారి చర్చ కార్యక్రమంలో కొంత మార్పు కనిపిస్తుంది. మోడరేటర్ ఉంటారు కానీ పానలైట్లు ఉండరు. చాలా తక్కువ మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు. చేతులు కలుపుకునే సంప్రదాయం కూడా ఈసారి ఉండదు. వేదిక వద్ద ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా కూడా హాజరుకానున్నారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/