ట్రంప్‌ ఐర్లాండ్‌ పర్యటన

Donald Trump and Leo Varadkar
Donald Trump and Leo Varadkar

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఐర్లాండ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరుదేశాధినేతలు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఐర్లాండ్‌ ప్రధాని లియో వరద్కార్‌ ఉద్ఘాటించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, సరిహద్దులో భద్రతా ప్రమాణాల పెంపు తదితర అంశాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం భేటీకి సంబంధించిన వివరాలను వైట్‌హౌస్‌ కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 29 లోపు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగాల్సి ఉంది. బ్రెగ్జిట్‌ అనంతరం ఏ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలనే అంశంపై సుదీర్ఘ చర్చ కొనసాగింది.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/