ట్రంప్ నోరు మరోసారి కంపు, ఇలా అన్నాడు ఏంటి…?

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిట్ట. ఏ అంశం గురించి ఆయన మాట్లాడినా సరే ఏదోక వివాదాస్పద వ్యాఖ్య చేయడం ఆయనకు పరిపాటి. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరిని ఏకరువు పెడుతూ ఉంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలైనా… కరోనా మహమ్మారి తీవ్రతపై అయినా, చివరికి నల్ల జాతీయులపైన అయినా సరే ఆయన నోటి దురుసుతనం కొనసాగుతుంది.

trump

తాజాగా ఆయన అధ్యక్ష అభ్యర్ధి డిబేట్ లో పాల్గొని వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసారు. “చైనా వైపు చూడండి. ఇది ఎంత మురికిగా ఉంటుంది…? రష్యా వైపు చూడండి, భారతదేశం వైపు చూడండి, ఎంత మురికిగా ఉన్నాయి…? గాలి కూడా మురికిగా ఉంది అని అధ్యక్షుడి చర్చ సందర్భంగా వాతావరణ మార్పులపై మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.