యుద్ధానికి దిగితే దేశం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం

ట్రంప్‌ ఇరాన్‌కు హెచ్చరికలు

Hassan Rouhani, trump
Hassan Rouhani, trump

వాషింగ్టన్‌: గల్ఫ్‌లో మోహరించిన అమెరికా యుద్ద నౌకలు ఇరాన్‌ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తమతో సైనిక పరమైన ఘర్షణలకు దిగితే ఇరాన్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘాటుగా హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య సైనిక పరమైన ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ట్రంప్‌ ఇలా వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ..ఇరాన్‌ మాతో యుధ్దం చేయాలనుకుంటే ఆ దేశాన్ని తుడిచిపెట్టాల్సి వస్తుందని ,మరోసారి అమెరికాను బెదిరించే సాహసం కూడా చేయలేదని ట్రంప్‌ ఆదివారం ట్వీట్‌లో హెచ్చరించారు. ఇటు ఇరాన్‌ మిలిటరీ చర్యలపై ట్రంప్‌ అధికారులతో చర్చించారు.
ఆదివారం ఓ న్యూస్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ..యుద్ధం చేయాలని తాను అనుకోవట్లేదని, యుద్ధం వల్ల ఆర్ధికంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడంతో పాటు ఎంతో మంది మరణించాల్సి వస్తుందని..అని చెప్పారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జవద్‌ జరీఫ్‌ స్పందిస్తూ..ట్రంప్‌ యుద్ధ హెచ్చరికలకు జంకేది లేదని, ఇరాన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యనించారు. ఇరానియన్లు దురాక్రమణలను దాటుకుని వేలకొలది మైళ్లు విస్తరించారు. ఆర్థిక ఉగ్రవాదం, యుద్ధ బెదిరింపులతో ఇరాన్‌ను అంతం చేయలేరు…ఇరానియన్లను గౌరవించే ప్రయత్నం చేయండి…దాంతో ఏదైనా ఫలితముంటుంది…అని ఘాటుగా సమాధానమిచ్చారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/