టిచాక్, వీచాట్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన జో బైడెన్
US President Joe Biden revokes ban on TikTok, WeChat
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టిక్‌టాక్, వీచాట్ సహా పలు చైనా కంపెనీలకు చెందిన యాప్స్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. అదే సమయంలో.. సమాచార భద్రత కోసం ‘యూఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ సప్లై చైన్’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సైతం బైడెన్ సంతకం చేశారు. టిక్‌టాక్, వీ చాట్ సహా ఎనిమిది ఇతర సాఫ్ట్వేర్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అధ్యక్షుడు బైడెన్ మూడు కార్యనిర్వాహక ఉత్తర్వు (ఈఓ)లపై సంతకం చేశారని వైట్‌హౌస్ తెలిపింది.
కాగా, అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్, వీచాట్ వంటి చైనా యాప్‌లను అమెరికా యాప్‌స్టోర్ నుంచి తొలిగించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు అమెరికాలో నిర్వహించకుండా నిషేధించారు. ఈ వారం ప్రారంభంలో 59 చైనా సైనిక, నిఘా సంస్థలు అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధించింది. ఇందులో ట్రంప్ హయాంలోనే 44 చైనా కంపెనీలపై నిషేధం విధించారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/