స్కిడ్‌ అయి నదిలో పడిన విమానం

plane-skids-into-st-johns-river
plane-skids-into-st-johns-river

హైదరాబాద్‌: అమెరికాలో బోయింగ్‌ మియామి ఎయిర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు చెందిన 737 విమానం ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో రన్‌వే మీద నుండి స్కిడ్‌ అయి జారి జాన్స్ న‌దిలో ప‌డింది. ఫ్లోరిడాలోని జాక్స‌న్‌విలేలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో విమానంలో 142 మంది ఉన్నారు. అయితే ఎవ‌రికీ ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు తేల్చారు. గ్వాంట‌నామే బే నుంచి బ‌య‌లుదేరిన విమానం.. స్థానిక కాల‌మానం ప్ర‌కారం రాత్రి 9.40 నిమిషాల‌కు జాక్స‌న్‌విలే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న‌ది.విమానంలో ఉన్న ప్ర‌యాణికులంతా క్షేమంగా ఉన్న‌ట్లు ఆ న‌గ‌ర మేయ‌ర్ తెలిపారు. విమాన ఇంధ‌నం న‌దిలో క‌ల‌వకుండా ఉండేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/