ఫాయిడ్‌ మృతి..పోలీస్ ఆఫీస‌ర్‌ అరెస్టు

ఆఫ్రికన్ అమెరికన్ మెడ‌‌ పై మోకాలితో తొక్కిపెట్టిన అధికారి

four-minnesota-police-officers-fired-after-death-of-black-man

అమెరికా: అమెరికాలోని మిన్నియాపోలిస్‌లో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిని శ్వేతజాతీయుడైన పోలీస్‌ ఆఫీసర్‌ డెరెక్‌ చౌవిన్‌ అత్యంత అమానవీయంగా మెడపై మోకాలిని నొక్కిపెట్టి చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో శుక్ర‌వారం డెరెక్ చౌవిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ శ్వేత‌జాతి పోలీసుపై థార్డ్ డిగ్రీ మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు చేశారు. న‌ల్ల‌జాతీయుడి మెడ‌ను మోకాలితో నొక్కిపెట్టిన కేసులో మొత్తం న‌లుగురు పోలీసుల‌పై వేటు వేశారు. ఫ్లాయిడ్ మ‌ర‌ణాన్ని ఖండిస్తూ అమెరికాలో నిర‌స‌న‌లు మిన్నంటాయి. మిన్నియాపోలీస్‌లో వంద‌లాది షాపుల‌ను ధ్వంసం చేశారు. ఆఫీస‌ర్ డెరెక్ చౌవిన్ క‌స్ట‌డీలో ఉన్న‌ట్లు హెన్నిపిన్ కౌంటీ ప్రాసిక్యూట‌ర్ మైక్ ఫ్రీమ‌న్ తెలిపారు. చౌవిన్ అరెస్టును మిన్న‌సొటా సేనేట‌ర్ ఆమీ క్లోబుచార్ స్వాగ‌తించారు. న్యాయం కోసం ఇది తొలి అడుగు అని ఆ సేనేట‌ర్ అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/