ఉత్తర కొరియాతో చర్చలకు అమెరికా రెడీ

Stephen Biegun
Stephen Biegun

వాషింగ్టన్‌: ఉత్తర కొరియాతో అణు చర్చలను పున: ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా దౌత్యవేత్త స్టీఫెన్‌ బీగన్‌ ప్రకటించారు. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను ముగించిన మరునాడే అమెరికా దౌత్యవేత్త ఈ ప్రకటన చేయడం విశేషం. గత ఫిబ్రవరిలో వియత్నాంలో ఇరుదేశాల అధ్యక్షులు ట్రంప్‌, కిమ్‌ మధ్య జరిగిన చర్చలు అర్ధంతంగా ముగిసిన తరువాత ఇరువురు నేతలూ పాంగ్యాంగ్‌లో మరోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. అణుచర్చలు పున: ప్రారంభించాలని గత జూన్‌లో జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలూ ఒక అంగీకారానికి వచ్చారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/