ప్రతిభ ఆధారంగా ఇచ్చే గ్రీన్‌కార్డుల కోటా పెంపు!

Green Card
Green Card

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రభుత్వం గ్రీన్‌కార్డుల జారీలో ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా ఇచ్చే కోటాను 12 శాతం నుండి 57 శాతానికి పెంచేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఈ మేరకు ట్రంప్‌ అల్లుడు, సీనియర్‌ సలహాదారు జారెద్‌ కుష్నెర్‌ శ్వేతసౌధంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చివరి దశలో ఉండగా.. త్వరలోనే కాంగ్రెస్‌ ముందుకు తీసుకొచ్చేందుకు ట్రంప్‌ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రతిభ ఉన్నవారు గ్రీన్‌కార్డులు పొందే అవకాశం ఉంటుందని, అంతేగాక.. వచ్చే 10ఏళ్లలో అమెరికా పన్ను ఆదాయం కూడా 500 బిలియన్‌ డాలర్లు పెరుగుతుందని కుష్నెర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖప్రస్తుతమున్న వలస విధానం చాలా పాతది. ప్రతిభ ఆధారిత కోటా ద్వారా కేవలం 12శాతం మందికి మాత్రమే గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్నాం. కానీ చాలా దేశాల్లో ఈ కోటా చాలా ఎక్కువగా ఉంది. కెనడాలో 53శాతం, న్యూజిలాండ్‌లో 59శాతం, ఆస్ట్రేలియాలో 63శాతం, జపాన్‌లో 52శాతం ఇస్తున్నారు. అందుకే అమెరికాలో దీన్ని 57శాతానికి పెంచాలని ట్రంప్‌ ప్రతిపాదించారుగ అని కుష్నెర్‌ తెలిపారు.
ప్రతిభ ఆధారిత కోటా పెంపు గురించి ఇటీవల ట్రంప్‌ కూడా స్పందించారు. ఈ కోటాను 57శాతానికి పెంచుతామని, అవసరమైతే మరింత పెంచే అవకాశాలున్నట్లు చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/