అల్‌ఖైదా నాయకుడిని డ్రోన్ దాడితో హతమార్చిన అమెరికా

అమెరికాతో పాటు తమ మిత్ర‌ దేశాల పౌరుల‌పై దాడులు త‌గ్గుతాయ‌న్న అమెరికా

సిరియా : సిరియాలో డ్రోన్‌ దాడిలో అల్‌ఖైదా కీల‌క నేత‌ అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్ ను హతమార్చామ‌ని అమెరికా ప్ర‌క‌టించింది. అత‌డు హ‌తం కావ‌డంతో అమెరికా పౌరులతో పాటు తమ మిత్ర‌ దేశాలు, అమాయక ప్ర‌జ‌ల‌పై అల్‌ఖైదా జరిపే దాడులు కొంతమేర తగ్గే అవకాశం ఉంద‌ని మెరికా ఆర్మీ మేజర్‌ జాన్ రిగ్స్‌బీ తెలిపారు.

అబ్దుల్‌ హామీద్‌ అల్ మ‌తార్ ప్రపంచ వ్యాప్తంగా అల్‌ఖైదా జ‌రిపిన‌ దాడుల్లో కీలక పాత్ర పోషించాడని ఆయన వివ‌రించారు. ఇటీవ‌ల‌ దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడులు జ‌రిపారు. ఈ నేప‌థ్యంలోనే అమెరికా డ్రోన్ తో దాడి చేసి హ‌మీద్ అల్ మ‌తార్ ను మ‌ట్టుబెట్టిన‌ట్లు తెలుస్తోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/