మా దేశం ఇప్పటికే నిండిపోయింది

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం కాలిఫోర్నియాలోని కలెక్సికోల్‌ సరిహద్దు గస్తీ బృందాలు, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూఅమెరికా ఇప్పటికే నిండిపోయిందని.. అక్రమ వలసదారులకు, శరణార్థులకు ఇక చోటు లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో వలసల వ్యవస్థ భారంగా మారింది. ఇక దీనిని కొనసాగించనివ్వం. ఇకపై కొత్తగా ఎవరికీ ఆశ్రయం ఇవ్వబోము. మా దేశం నిండిపోయింది. అందుకే వెనుదిరిగి వెళ్లడం మంచిది. అని పేర్కొన్నారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/