క్షిపణి దాడులు అమెరికాకు చెంపదెబ్బ

తిరుగుబాబు ఇంకా బతికే ఉంది… అమెరికాను హెచ్చరించిన అలీ ఖొమైనీ

Ali Khamenei
Ali Khamenei

ఖోమ్‌: ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులపై ఇరాన్ అగ్రనేత అలీ ఖొమైనీ స్పందింస్తూ..అమెరికాకు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. తిరుగుబాటు ఇంకా బతికే ఉందని ఈ ఘటనలు చెబుతున్నాయని, ఇది అమెరికాకు చెంపదెబ్బ మాత్రమేనని అన్నారు. అయినప్పటికీ ప్రతీకార దాడులుని, సైనిక చర్యలతో సులేమానీ తిరిగిరారని తెలుసని, ఈ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యాన్ని, ఉనికిని అంతమొందించడమే మా లక్ష్యమని వ్యాఖ్యానించారు.పవిత్ర ఖోమ్ నగరంలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానికి నివాళులు అర్పించిన అనంతరం అలీ ఖొమైనీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇరాన్ క్షిపణదాడిపై బ్రిటన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇరాన్ దాడి జరిపింది సంకీర్ణ దళాల స్థావరంపై అని, అందులో తమ బలగాలు కూడా ఉన్నాయని ఆరోపించింది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/