అమెరికాలో 40 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం

జనవరిలో 7.5 శాతానికి చేరిక
1982 ఫిబ్రవరి తర్వాత అత్యధికం

న్యూఢిల్లీ: అమెరికా ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయిన ధరల కాకతో ఉడికిపోతోంది. నిత్యావసరాల ధరలు పెరగుదల ఫలితంగా ద్రవ్యోల్బణం జనవరి నెలలో 7.5 శాతానికి చేరింది. గడిచి ఏడాది కాలంలో ఈ స్థాయికి పెరగడం గమనార్హం. 1982 ఫిబ్రవరి తర్వాత ఒక ఏడాదిలో ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.

12 నెలల క్రితంతో పోలిస్తే 2022 జనవరిలో ద్రవ్యోల్బణం 7.5 శాతానికి పెరిగినట్టు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. సరఫరా, కార్మికుల కొరత, కరోనా ప్రతికూలతల నుంచి బయటపడేసేందుకు ఫెడరల్ రిజర్వ్ పెద్ద ఎత్తున వ్యవస్థలోకి నిధులను జొప్పించడం, వినియోగ డిమాండ్ గరిష్టాలను చేరుకోవడం రెక్కలు విప్పుకునేలా చేశాయి. ధరలు పెరిగడవం వల్ల అమెరికన్లు నిత్యావసరాలైన ఆహారం, గ్యాస్, పిల్లల సంరక్షణ కోసం వెచ్చించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది అధికారంలో ఉన్న జో డైబెన్ కు క్లిష్టమైన పరిస్థితే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/