ఏపిలో అవినీతిరహిత, పారదర్శక పాలన ఉంది

  • ఏపిలో పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఎలాంటి అడ్డంకులు ఉండవు
cm jagan-US
cm jagan-US

వాషింగ్టన్‌: ఏపి సిఎం జగన్‌ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌ (డీసీ)లో యూఎస్‌- ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సిఎం జగన్ మాట్లాడారు. ఏపిలో పరిశ్రమలు పెట్టాలనుకునే పెట్టుబడిదారులు ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని జగన్‌ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేశారు. స్వయంగా సీఎం కార్యాలయం దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుందని చెప్పారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ అథారిటీ (ఇప్మా) అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ సంస్థ పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్, నీరు సమకూర్చి పెడుతుందని చెప్పారు. ఏపీలో విశాలమైన సముద్రతీరం ఉందనీ, పలు కొత్త నౌకాశ్రయాలు నిర్మిస్తున్నామని జగన్ అన్నారు. ఈ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆయన అమెరికా పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

ఉప్పునీటిని మంచినీటిగా మార్చడం, మైట్రో రైలు ప్రాజెక్టులు, బకింగ్ హమ్ కాలువ, విద్యుత్ బస్సులు, నదుల అనుసంధానం, ఆక్వా తదితర రంగాల్లో విస్తరణ కోసం ఏపీలో అపారమైన అవకాశాలు, మార్కెట్ ఉన్నాయని జగన్ గుర్తుచేశారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/